సంగారెడ్డి, 2026-08-11
జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజేఐజేయూ) పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం మంగళవారం రామచంద్రాపూర్‌లోని లక్ష్మీ గార్డెన్స్‌లో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, యూనియన్ బలోపేతం, సంక్షేమ కార్యక్రమాలపై నాయకులు విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమమే యూనియన్ ప్రధాన ఎజెండా అని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. యూనియన్ బలోపేతానికి ప్రతి సభ్యుడు భాగస్వామి కావాలని, జర్నలిస్టుల సమస్యలపై సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కే.పైసల్ మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు యూనియన్ నిరంతరం కృషి చేస్తుందన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఆరోగ్య కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, యూనియన్ను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఐక్యంగా ఉన్నప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ నాయకులు, కార్యవర్గ సభ్యులు మాట్లాడి తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు ఆసిఫ్, ప్రధాన కార్యదర్శి బసవేశ్వర్, చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం అధ్యక్షుడు సిద్ధిక్, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ చవాన్, కోశాధికారి లక్ష్మణ్, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరిఫ్, ప్రెస్‌క్లబ్‌ల అధ్యక్షులు హాజీ, మినాజ్, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. వీరంతా జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమంపై తమ సూచనలు చేశారు.