రిమ్స్ ఆసుపత్రిలోని స్పెషల్ నియోనాటల్ కేర్ యూనిట్ () పిల్లల వార్డులో సోమవారం రాత్రి ఏసీ పేలి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజానర్సింహ జిల్లా కేంద్రానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
రిమ్స్ ఆసుపత్రిలోని స్పెషల్ నియోనాటల్ కేర్ యూనిట్ () పిల్లల వార్డులో సోమవారం రాత్రి ఏసీ పేలి అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజానర్సింహ జిల్లా కేంద్రానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజానర్సింహ, ఎమ్మెల్యే పాయల్ శంకర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిష్టినా జెడ్ చోంగ్తూ, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితర ఉన్నతాధికారులతో కలిసి రిమ్స్ లో అగ్ని ప్రమాదం అనంతరం చేపట్టిన సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పిల్లలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి అవసరమైన వైద్య సేవలు అందించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు సమాచారం.












