వెంకట్రావుపేట్ గ్రామంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రేగుంట సతీష్ మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని, స్వేచ్ఛగా మాట్లాడే హక్కుతో పాటు రిజర్వేషన్లు పొందుతున్నారని తెలిపారు.
గ్రామంలో 2012లో గ్రామ పెద్దల సహకారంతో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించుకున్నామని, అప్పటి నుండి అంబేద్కర్ యువజన సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని రేగుంట సతీష్ పేర్కొన్నారు. అటవీ ప్రాంత బిడ్డలకు నిత్యావసర సరుకులు, అనాథలకు భోజనం, ఆసుపత్రులలో రోగులకు పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రేగుంట సతీష్ తో పాటు మంద మధుకర్, బేడిగం రంజిత్, నాతరి శ్రీకాంత్, రేగుంట ఉదయ్ పాల్గొన్నారు. రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల ఆర్టీఏ బృందం మరియు అంబేద్కర్ సంఘ సభ్యులు కూడా పాల్గొన్నారు.












