భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీమారావు రాంజీ అంబెడ్కర్ 135వ జయంతి సందర్భంగా భీమారం మండల కేంద్రంలో దళిత నాయకులు, BRS పార్టీ మండల అధ్యక్షుడు, అంబెడ్కర్ విగ్రహ కమిటీ చైర్మన్ కలగూర రాజకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి.
ఈ జయంతి వేడుకలకు వివిధ పార్టీల నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, మండల ప్రజలు, యువత అధిక సంఖ్యలో హాజరయ్యారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలగూర రాజకుమార్ మాట్లాడుతూ, అంబెడ్కర్ ఒక మహోన్నత నాయకుడని, ఆయన దేశానికి దిశా నిర్దేశం చేశారని అన్నారు.
అంబెడ్కర్ చూపిన మార్గంలో నడవడం ద్వారానే సమాజంలో సమైక్యతను సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా అంబెడ్కర్ కు ఘనంగా నివాళులర్పించారు.












