ప్రజలందరూ దసరా పండుగను ఆనందోత్సవాల మధ్య సుఖసంతోషాలతో జరుపుకోవాలని పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం ఆకాంక్షించారు. సోమవారం ఆయన పటాన్ చెరులో మాట్లాడుతూ, దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని తెలిపారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖ శాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. రైతులు, వ్యాపారులు, కార్మికులు, ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని, పరస్పర ప్రేమాభిమానాలతో సమాజంలో ఐక్యతను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగలను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు.












