మునిపల్లి, 4 September
వికారాబాద్ జిల్లా మర్పల్లిలో సీనియర్ వివాహం ఎంసిఎం ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ జడ్పీటీసీ పైతర మీనాక్షి సాయికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ (అక్షర వేకువ): మండలంలోని మల్లికార్జున్ పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు విష్ణు కూతురి వివాహం వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామ శివారులో గల ఎంసిఎం ఫంక్షన్ హాల్ లో అంగరంగా వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు మాజీ జడ్పీటీసీ పైతర మీనాక్షి సాయికుమార్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో పెద్ద గోపులారం మాజీ సర్పంచ్ కీర్తి కుమారి, ఖమ్మంపల్లి గ్రామం చెందిన వార్డు సభ్యురాలు సుమిత్ర, బీఆర్ఎస్ నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.











