రాంచంద్రాపురం (అక్షరవేకువ) సెప్టెంబర్ 10
వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని సంగారెడ్డి జిల్లా మండల కేంద్రంలోని సండే మార్కెట్ వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆమె విగ్రహానికి పూలమాలలు, పూలు సమర్పించి, కొబ్బరి కాయలు కొట్టి నివాళులర్పించారు.
వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో సండే మార్కెట్ వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆమె విగ్రహానికి పూలమాలలు, పూలు సమర్పించి, కొబ్బరి కాయలు కొట్టి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె పెత్తందారీ విధానానికి, దోపిడీకి, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా, దొర-దొరసాని సంస్కృతికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన వీర మహిళ చాకలి ఐలమ్మ అని ఆమె త్యాగనిరతిని గుర్తు చేసుకున్నారు. భూమి కోసం, భుక్తి కోసం, శ్రామిక వర్గ విముక్తి కోసం ఆమె చేసిన పోరాట పటిమలు, అనంతరం జరిగిన పలు ప్రజా పోరాటాలకు నాందిగా నిలిచాయని అన్నారు. అన్ని రకాల దోపిడీలు, వివక్షతలు అంతమయ్యే వరకు ఆమె ఆశయ సాధనలో అందరూ నడుం బిగించాలని అభిప్రాయపడ్డారు. అమరత్వం పొందిన వీరనారి చాకలి ఐలమ్మకు జోహార్లు అర్పించారు. ఆమె విగ్రహాన్ని సండే మార్కెట్ వద్ద స్థాపించి, అందరూ దివంగత వీరనారి చాకలి ఐలమ్మకు గురువారం నివాళులర్పించే అవకాశం కల్పించిన తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పానగేశ్కు పలువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం తాజా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండం మోహన్ రెడ్డి, వాసులు నర్సింహా, సుధాకర్ ప్రభు, సాయికిరణ్, క్రిష్ణ, ఎల్లయ్య, శ్రీను, రవి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.











