80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పోలీసు సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు
మాతృభూమి కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి సాధించిన స్వాతంత్ర్యాన్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వేచ్ఛను, భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన తెలిపారు.
పోలీసుల పాత్ర
దేశ భద్రతలో సరిహద్దుతో పాటు అంతర్గత భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో పోలీసులుగా మన పాత్ర అత్యంత కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తమ విధులను నిబద్ధతతో, అంకితభావంతో, నిజాయితీగా నిర్వర్తిస్తే సరిహద్దుల్లో సేవలందిస్తున్న సైనికుల త్యాగాలకు సమానంగా మన సేవలు నిలుస్తాయని ఆయన గుర్తుచేశారు. పోలీసు సిబ్బంది కూడా అదే ధృఢ సంకల్పంతో ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.
శుభాకాంక్షలు
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పోలీసు సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఏఆర్. డీఎస్పీ ఎ.నరేందర్, యస్.బి. ఇన్స్ పెక్టర్లు సదా నాగరాజు, డి.సి.ఆర్.బి. ఇన్స్ పెక్టర్ రమేష్, ఐటి సెల్ ఇన్స్ పెక్టర్ నిరంజన్ రెడ్డి, ఆర్.ఐ.లు సురేష్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, యస్.బి. డి.సి.ఆర్.బి. యస్.ఐ.లు, సిబ్బంది పాల్గొన్నారు.