పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండలం, ఇద్దులాపూర్ గ్రామానికి చెందిన మాల సంఘం మాజీ అధ్యక్షుడు పనికెల లాలయ్య ఇటీవల అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకున్న నేపథ్యంలో, టిఇపిఏ తెలంగాణ ఎడ్యుకేషనల్ పేరెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు దార మధు ఆదివారం ఆయనను స్వగృహంలో పరామర్శించారు.
ఆపరేషన్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న పనికెల లాలయ్యను కలిసి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లాలయ్య త్వరగా కోలుకోవాలని దార మధు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా, లాలయ్య కుటుంబ సభ్యులతో దార మధు మాట్లాడుతూ, ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా సహాయం అవసరమైతే సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో మాల సంఘం నాయకుడు చీదురు నరేందర్, మాజీ అధ్యక్షుడు కూతురు రాజేందర్, సంఘం సభ్యులు దార రవి, మామిడి అశోక్ తదితరులు పాల్గొన్నారు. వారందరూ లాలయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సమావేశమైన నాయకులు, సభ్యులు లాలయ్య ఆరోగ్యానికి సంబంధించి పలు విషయాలను చర్చించారు. సామాజిక బాధ్యతగా ఒకరినొకరు ఆదుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.










