మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 01
మంచిర్యాల జిల్లా భీమారం గ్రామంలో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. భీమారం మండలంలోని రేశవేని శ్రీనివాస్ పాలసీదారుల సేవా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డ్ మెంబర్స్ ఫోరం ఇన్చార్జ్ పాల్గొని కేక్ కట్ చేశారు.
మంచిర్యాల జిల్లా భీమారం గ్రామంలో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. భీమారం మండలంలోని రేశవేని శ్రీనివాస్ పాలసీదారుల సేవా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ఉస్కమల్ల విజయలక్ష్మి, తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం మంచిర్యాల జిల్లా ఇన్చార్జ్ ముక్త సంతోష్ కుమార్ హాజరయ్యారు. వారు కేక్ కట్ చేసి, ఎల్ఐసీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, 70 సంవత్సరాలుగా భారతీయ జీవిత బీమా సంస్థ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ, కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పిస్తూ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. సంస్థ సేవలను ప్రశంసించారు.
ఎల్ఐసీ 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గ్రామస్తులు, పాలసీదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంస్థ పట్ల తమకున్న అభిమానాన్ని, విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు.











