భీమారం, 8 September
భీమారం మండలం, ధర్మారం గ్రామ పంచాయితీలో సర్పంచ్ దాసరి మణిదీపక్ ఆధ్వర్యంలో వీబీజీ రామ్‌జీ గ్రామసభను నిర్వహించారు. ఈ గ్రామసభలో ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలు, అర్హతలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ధర్మారం గ్రామ పంచాయితీలో VBG RAM G ఫైనల్ గ్రామసభ భీమారం మండలం, ధర్మారం: ధర్మారం గ్రామ పంచాయితీలో ఈరోజు వీబీజీ రామ్‌జీ ఫైనల్ గ్రామసభను సర్పంచ్ దాసరి మణిదీపక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వీబీజీ రామ్‌జీ చట్టం కింద గ్రామ ప్రజలకు ఉపయోగపడే వివిధ పథకాలు, వాటి ప్రయోజనాలు, అర్హతలు మరియు గ్రామస్థులకు అందే అవకాశాలపై ప్రజలకు వివరంగా అవగాహన కల్పించారు. గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దాసర మణిదీపక్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధిలో గ్రామసభలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ప్రజలకు ఉపయోగపడే పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలు, అవసరాలను గ్రామసభ ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో మండల ఏపీఓ జీనత్ , పంచాయితీ కార్యదర్శి శ్రావణ్ కుమార్, టెక్నికల్ అసిస్టెంట్ శరత్‌తో వార్డు సభ్యులు పాటు గ్రామ ప్రజలు, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.











