హజీపూర్, 12 September
ఎల్లంపల్లి ప్రాజెక్టుల వల్ల ముంపునకు గురైన గుడిపేట, నన్నూరు గ్రామ నిర్వాసితుల కోసం కేటాయించిన ఆర్ అండ్ ఆర్ కాలనీలోని ప్రభుత్వ భూములను కాపాడాలని యువకులు డిమాండ్ చేశారు. ఈ భూములను కొందరు అక్రమంగా పట్టాలు చేసుకుని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, వారు శుక్రవారం ధర్నా చేపట్టారు.
హాజీపూర్ మండలం గుడి పేట పునరావాస కాలనీలో ప్రభుత్వ భూములు కాపాడాలి. ఎల్లంపల్లి ప్రాజెక్టులొ ముంపుకు గురైన గుడిపేట నoన్నూర్ గ్రామాలకు (ఆర్ అండ్ ఆర్) కాలనీలో ప్లాట్ల కేటాయింపు సమయంలో కాలనీవాసులకు గుడి బడి పార్క్ అంగన్వాడి తదితర ఇతరత్రా అవసరాల కోసం కేటాయించిన భూములను కాపాడాలని యువకులు డిమాండ్ చేశారు ఈ మేరకు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం (ఆర్ అండ్ ఆర్) కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు నిర్వాసితులకు ప్లాట్లు కేటాయించారని ఆ సమయంలో గ్రామ కాలనీ అవసరాలకు వదిలేసిన ప్లాట్లను కొందరు అక్రమంగా పట్టాలు చేసుకుని ఇతరులకు అమ్మాలని చూస్తున్నారన్నారు పట్టాలపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాసె తిరుపతి నారిశెట్టి మధు బయ్య వెంకటేష్ నక్క వంశీ మల్క అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.












