మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 02
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 52వ డివిజన్లో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి వీలుగా ఒక స్థలాన్ని చదును చేశారు. గతంలో రేకులతో ఆక్రమించిన ఈ స్థలాన్ని తొలగించి, పండుగకు సిద్ధం చేశారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహకారంతో ఈ పనులు జరిగాయి.

హైటెక్ సిటీ హరిహర క్షేత్రం వెనుక ఉన్న ఈ స్థలం విషయంలో గత కమిటీ నిర్లక్ష్యం వహించిందని, దీంతో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి సరైన స్థలం లేదని కార్పొరేటర్ సాయిని స్రవంతి కిషోర్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కార్పొరేషన్ సిబ్బంది రంగంలోకి దిగారు.
జేసీబీ సహాయంతో రేకులతో నిర్మించిన ఆక్రమణలను తొలగించి, ఆ స్థలాన్ని చదును చేశారు. రాబోయే బతుకమ్మ పండుగను మహిళలు సౌకర్యవంతంగా ఆడుకోవడానికి అవకాశం కల్పించినందుకు స్థానికులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కార్పొరేటర్ స్రవంతి కిషోర్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సభ్యులు పూరేళ్ల పోచమాలు తదితరులు పాల్గొన్నారు.