మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 31
మంచిర్యాల గోదావరి పుష్కర్ ఘాట్ పనులకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సోమవారం శంకుస్థాపన చేసి, పనులను ప్రారంభించారు. ఘాట్ పనులకు 12 కోట్లు, రోడ్లు, ఇతర మౌలిక వసతులకు 16.70 కోట్లు కేటాయించారు.
మంచిర్యాల గోదావరి పుష్కర్ ఘాట్ పనులకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సోమవారం శంకుస్థాపన చేసి, పనులను ప్రారంభించారు. ఘాట్ పనులకు 12 కోట్లు, రోడ్లు, ఇతర మౌలిక వసతులకు 16.70 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
పనుల్లో నాణ్యత పాటించాలని, మరుగుదొడ్లు, వస్త్ర మార్పు గదులు, ఇతర మౌలిక వసతుల ఏర్పాట్లు చేయాలని సూచించారు. పనుల్లో వేగాన్ని పెంచాలని, ప్రభుత్వ నిధులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.
పుష్కర ఘాట్ పనులను కాంట్రాక్టర్లు త్వరితగతిన, సుందరంగా, నాణ్యతతో చేపట్టాలని, ప్రభుత్వ నిధులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు.
రాబోయే పుష్కరాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఫంక్షన్ హాల్‌తో పాటు ప్రతిచోటా సీసీ కెమెరాల ఏర్పాటు, రక్షక బృందాల తనిఖీలు ఉంటాయని మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మేయర్ మధుకర్, కార్పొరేటర్లు హరికృష్ణ, గోపన్న తదితరులు పాల్గొన్నారు.












