సంగారెడ్డి, 14 September
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రతిమలను పంపిణీ చేశారు. స్థానిక కౌన్సిలర్ నాయికోటి అశ్విని నవీన్ కుమార్, డా.శిల్ప సౌజన్య సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రతిమలను పంపిణీ చేశారు. స్థానిక కౌన్సిలర్ నాయికోటి అశ్విని నవీన్ కుమార్, డా.శిల్ప సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు లయన్ శంకరి విజయేందర్ రెడ్డి అధ్యక్షతన పోతిరెడ్డిపల్లి శ్రీ శివాంజనేయ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు ప్రజలకు మట్టి వినాయకుల ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. మట్టి వినాయకులను పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు నీటి కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణహితమైన మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ నాయికోటి రామప్ప, క్లబ్ సభ్యులు టి.అల్లంరెడ్డి, బి.శ్రీనివాస్, కాలనీ పెద్దలు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.












