సంగారెడ్డి, 2026-08-31
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీ నుండి 30 వరకు పోలీసు చట్టం1861లోని సెక్షన్ 30, 30(ఎ) అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ నేపథ్యంలో, అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు.
శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీ నుండి 30 వరకు నెల రోజుల పాటు పోలీసు చట్టం1861లోని సెక్షన్ 30, 30(ఎ) అమలులో ఉంటుందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో తెలిపారు.
కావున సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రజా ఆస్తికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపట్టకూడదని హెచ్చరించారు.
ఈ విషయంలో జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించవలసిందిగా ఎస్పీ సూచించారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు.












