11వ డివిజన్, Mancherial, Telangana (అక్షరవేకువ) సెప్టెంబర్ 21
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులు సంయుక్తంతెలుస్తుంది ఈ కూల్చివేత చర్యలు చేపట్టారు. పెద్ద ఎత్తున సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులు కలిసి ఈ కూల్చివేత చేపట్టారు. పెద్ద ఎత్తున సిబ్బంది రంగంలోకి దిగి కూల్చివేత చర్యలు చేపట్టారు. కన్నం వెంకటేశ్వర్లు 44వ సర్వే నెంబర్లో అనుమతి పొంది, 43వ సర్వే నెంబర్లో నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. 43వ సర్వే నెంబర్లోని స్థలంపై బాధితుడు కోర్టును ఆశ్రయించగా, తహసిల్దార్‌కు నిజనిర్ధారణ ఆదేశాలు వెలువడినట్లు తెలుస్తోంది.
ఎంఆర్ఓ పంచనామా అనంతరం, భవన నిర్మాణ ప్రాంతం 43వ సర్వే నెంబర్‌గా నిర్ధారణ కావడంతో, అనుమతి 44వ సర్వే నెంబర్లో ఉండటంతో అధికారులు దీనిని అక్రమ నిర్మాణంగా తేల్చి కూల్చివేశారు. ఈ కూల్చివేతల్లో కార్పొరేషన్ కమిషనర్ జి. అన్వేష్, టౌన్ ప్లానింగ్ అధికారులు, టిపిఓ భూస సంపత్, నస్పూర్ పోలీసులు, ఇతర సిబ్బంది పాల్గొన్నట్లు సమాచారం.












