Mancherial/Kotapalli (అక్షరవేకువ) జూలై 30
పారుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రమాదకర స్థితిలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర జాగ్రత్తలు పాటించాలని కోరారు.
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పారుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామంలో ప్రమాదకర స్థితిలో ఉన్న ఇళ్లను పరిశీలించి, కూలిపోయే అవకాశం ఉన్న ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలైన ప్రభుత్వ పాఠశాల లేదా గ్రామపంచాయతీ కార్యాలయానికి తరలించాలని సూచించాము.
గ్రామమంతా పర్యటించి ప్రజలకు ఈ క్రింది జాగ్రత్తలు తెలియజేశాము: విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్ల దగ్గరకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లవద్దు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వండి.
లోతట్టు ప్రాంతాలు, వాగులు, కాలువలు, చెరువుల దగ్గరకు వెళ్లకండి. వరద నీటిని దాటే ప్రయత్నం చేయవద్దు.
పాత ఇళ్లు, పూరి గుడిసెలు, తడిసిన గోడలున్న ఇళ్లలో ఉండకుండా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి. అత్యవసరం అయితే తప్ప ఇంటి బయటకు రావద్దు.
చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. తాగునీటిని మరిగించి లేదా శుద్ధి చేసి మాత్రమే ఉపయోగించండి.
పాములు, విషపురుగులు బయటకు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. మొబైల్ ఫోన్లు ఛార్జ్‌లో ఉంచండి. టార్చ్, కొవ్వొత్తులు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోండి.
ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే గ్రామపంచాయతీ లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వండి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. మీ ప్రాణ భద్రతే మాకు అత్యంత ముఖ్యం.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోగరు, పంచాయతీ కార్యదర్శి రాజన్న పాల్గొన్నారు.












